హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన మీరాబాయి చానుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సిల్వర్ మెడల్ గెలిచిన ఆమెకు.. మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మీరాబాయి గెలుపు భారత్‌కు గర్వకారణం అన్నారు. హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
Hearty congratulations to ace Indian weightlifter @mirabai_chanu for winning a Silver Medal in the women’s weightlifting event at the 2020 Tokyo @Olympics. India is proud of you! #Olympics #Cheer4India #Tokyo2020 pic.twitter.com/HWfOBr1PaS
— KTR (@KTRTRS) July 24, 2021
ఒలింపిక్స్‌లో తొలి రోజే ఇండియా పతకాల బోణీ కొట్టింది. మహిళల 49 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ గెలిచింది. దీంతో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన భారత తొలి వెయిట్ లిఫ్టర్‌గా ఘనత సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. దాదాపు 24 తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం రావడం ఇదే మొదటిసారి. 2000 సంవత్సరం సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో మెడల్ గెలిచిన తొలి అథ్లెట్‌గా మీరాబాయ్ నిలిచింది.