హైదరాబాద్ : దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ నిర్వహించిన తొలి స్నాతకోత్సవంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. దేశ జనాభాలో సగానికి పైగా 27 ఏండ్ల వారేనని తెలిపారు. ప్రస్తుతం యువత ఆవిష్కరణల్లో చాలా చురుకుగా ఉందని కొనియాడారు. నాయకులు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, ఆర్థిక అంశాలపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నారని తనకు తెలుసన్నారు. అయితే హైదరాబాద్, తెలంగాణలో ఉన్న ఉద్యోగ అవకాశాలను పరిశీలించాలని, అందుకు మీ అందర్నీ ప్రోత్సాహిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రమోట్ చేసేందుకు తెలంగాణ చాంపియన్ స్టేట్‌గా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పడానికి తాను గర్వపడుతున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
I feel very proud to share with you that our young state of Telangana is today a role model state in the country: Minister @KTRTRS at the @MahindraUni First Annual Convocation 2022 program pic.twitter.com/DRg1ONgFqL
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 23, 2022