ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 10:54:09

లబ్ధిదారునికి ఎల్వోసీ అందజేసిన మంత్రి కొప్పుల

లబ్ధిదారునికి ఎల్వోసీ అందజేసిన మంత్రి కొప్పుల

హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేసుకోలేని నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తికి లక్ష రూపాయల ఎల్వోసీని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన బి.తిరుపతి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థికంగా వెనుకబడటంతో చికిత్స చేసుకోలేని పరిస్థితిలో ఆదుకోవాలని మంత్రిని కలిశారు. వారి దయనీయ పరిస్థితిని అర్థం చేసుకొని సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన లక్ష రూపాయల ఎల్వోసీ కాపీని లబ్ధిదారుని కుటుంబానికి మంత్రి కొప్పుల అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


logo