హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): మీడియా మాధ్యమాలతోపాటు సోషల్ మీడియాకూ ఎంతో క్రేజ్ పెరిగిందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. హైదరాబాద్ టీ హబ్‌లో శనివారం జరిగిన టీఎస్ఎఫ్ఏ డిజిటల్ అవార్డ్స్-2023 ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన షార్ట్ ఫిల్మ్‌ల విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెలుగు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నేటి యువతను స్టార్స్‌గా తయారు చేయడంలో సోషల్ మీడియా గొప్ప పాత్ర పోషిస్తున్నదని కోమటిరెడ్డి తెలిపారు. దానిద్వారా స్వయం ఉపాది కూడా పొందుతున్నారని వివరించారు.