నల్లగొండ : హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై (Hyderabad-Vijayawada National Highway) 17 బ్లాక్ స్పాట్లను(Black spots) గుర్తించాం. రూ. 325 కోట్లతో పనులు చేపడుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో హైదరాబాద్-విజ యవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న నాలుగున్నర సంవత్సరాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేదలకు ఇండ్లతో పాటు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.
ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వారం రోజుల్లో పేదలకు ఇంది రమ్మ ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని చెప్పారు. సొంత స్థలం ఉంటే తక్షణమే ఇల్లు ఇస్తాం. లేని వారికి ప్రభుత్వ స్థలం ఉన్నచోట ఇళ్లు కట్టించి ఇస్తామ తెలిపారు. రూ.30 వేల కోట్లతో హైదరాబాద్ రీజ నల్ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నామని, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారితో పాటు, ఇతర ఆర్ అండ్ బి రోడ్లకు రూ.16000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. అలాగే చిట్యాల లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు.