హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ): కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని వివిధ రోడ్డు ప్రాజక్టులపై జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని వివిధ స్టేట్ రోడ్ల అప్గ్రేడేషన్పై గడ్కరీతో చర్చించనున్నారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును తామే పూర్తిస్థాయిలో చేపట్టేలా అనుమతులు ఇవ్వాలని, భూసేకరణ ఖర్చులను మాత్రం పూర్తిగా కేంద్రమే భరించాలని కోమటిరెడ్డి ఈ సందర్భంగా కోరనున్నారు.