Minister Jagadish Reddy | హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా వెలిమనేడులోని భక్తాంజనేస్వామి ఆలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు దర్శించుకొని, మొక్కులు చెల్లించారు. ఆదివారం ఆలయంలో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన 108 తమలపాకుల తరహాలో వెండితో ప్రత్యేక తయారు చేయించిన మాలను స్వామివారికి మంత్రి సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.