Minister Jagadish reddy | అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీని మించినోళ్లు లేరు: మంత్రి జగదీశ్ రెడ్డి
అబద్ధాలు మాట్లాడటంలో ప్రధాని మోదీని (PM Modi) మించినోడు లేరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రధాని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.
సూర్యాపేట: అబద్ధాలు మాట్లాడటంలో ప్రధాని మోదీని (PM Modi) మించినోడు లేరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రధాని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. గుజరాత్ (Gujarat) రైతులు కూడా ఆయనను చూసి నవ్వుకుంటున్నారని చెప్పారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్లో 35 రూపాయలు కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. రైతు బంధు కింద రైతన్నలకు ఏడాదికి రూ.75 వేల కోట్లు ఇస్తున్నామని, గుజరాత్లో 10 రూపాయలైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారనడానికి యాదాద్రి పవర్ ప్లాంటే నిదర్శనమన్నారు. ఇప్పటి వరకు ప్లాంటుకు అనుమతులు ఇవ్వలేదని విమర్శించారు. గుజరాత్లో, భారత్‌తో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. కరెంటు లేక పొలాలు ఎండిపోతున్నాయని చెప్పే కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి విద్యుత్ వైర్ పట్టుకుంటే తెలుస్తుందని వెల్లడించారు. 24 గంటల విద్యుత్ గురించి మాట్లాడే హస్తం పార్టీ నేతలు.. ఏ క్షణమైనా కరెంటు తీగలు పట్టుకోవచ్చన్నారు. కాగా, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దార్శనికతతోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐటీ హబ్స్, అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 12కు పన్నెండు ఎమ్మెల్యే స్థానాలను మరోసారి బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

