నల్లగొండ జిల్లాలో ఘనంగా చకిలం 25వ వర్ధంతి
చకిలం శ్రీనివాసరావు | జిల్లాపై దివంగత నేత చకిలం శ్రీనివాసరావు చెరగని ముద్రే వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

నల్లగొండ : జిల్లాపై దివంగత నేత చకిలం శ్రీనివాసరావు చెరగని ముద్రే వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి అప్పట్లో చకిలం ఇల్లే శాశ్వత చిరునామాగా ఉండేదన్నారు. అటువంటి ముద్ర వేసుకోవడం అరుదైనదని, ఆ అదృష్టం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క చకిలం శ్రీనివాసరావుకు మాత్రమే దక్కిందని మంత్రి చెప్పారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన దివంగత కాంగ్రెస్ నేత చకిలం శ్రీనివాసరావు 25వ వర్ధంతి సభకు మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని రామగిరిలో చకిలం శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చకిలం తనయుడు టీఆర్ఎస్ రాష్ట్ర నేత చకిలం అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ క్యాడర్‌కు ఆపద వస్తే మొదట గుర్తుకు వచ్చేది చకిలం శ్రీనివాసరావు ఇల్లే అని గుర్తు చేశారు. నమ్ముకున్న క్యాడర్ కోసం ఎంత దూరమైన వచ్చేవారన్న పేరు శ్రీనివాస్ రావుకు ఉందన్నారు. తనకు అవకాశం కలిగిన ప్రతిసారి నమ్ముకున్న వారికి సముచిత స్థానం ఇచ్చేవారు అని మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
Konda Surekha | నిన్న ఈనాడు, నేడు కొండా సురేఖ..! కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పిన మాజీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

