Minister Harish Rao | హైదరాబాద్ అభివృద్ధి రజినీకి అర్థమైంది.. కానీ గజినీలకు కావట్లేదు.. ప్రతిపక్షాలపై మంత్రి హరీశ్ రావు సెటైర్
Minister Harish Rao | పటాన్చెరు పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
Minister Harish Rao | గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్ తీర్చారని మంత్రి హరీశ్‌రావు చేశారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయని అన్నారు. పేదలందరికీ ఉచితంగా మంచినీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇండ్లు కట్టడం అంటే అప్పుల్లో కూరుకుపోవడమే అన్నట్లుగా ఉండేదన్నారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ చాలా పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కిట్లు ఇస్తే.. ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు తప్ప ఏమీ జరగలేదని గుర్తు చేశారు.
కొల్లూరు టౌన్షిప్లో విద్య, వైద్యం, రవాణా సదుపాయం కల్పిస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి రజినీకాంత్‌కు అర్థమైంది కానీ.. మన దగ్గర ఉన్న గజినీలకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలే ప్రచారం చేయాలని అన్నారు. హైదరాబాద్‌లో లక్షమందికి డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రతి పేదవాడికి పక్కా ఇండ్లు ఇస్తామని.. పేదలు ఆత్మగౌరవంతో ఉండేలా చేస్తామని భరోసానిచ్చారు. ఎన్నికలు వస్తున్నాయంటే హామీలు, నినాదాలు చేస్తూ మీ దగ్గరికి వస్తుంటారని అన్నారు. దొంగ డిక్లరేషన్ చేస్తూ.. ఓట్ల కోసం వస్తున్నారన్నారు. ఎన్ని డిక్లరేషన్లు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తామని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టులో ఏపీ అక్రమంగా వేసిన కేసు కొట్టుడు పోయాయని అన్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

