కుమ్రం భీం ఆసిఫాబాద్ : సిర్పూర్(టీ) టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్పను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కాగజ్‌నగర్‌లో కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన సత్రాన్ని మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కోనప్ప దంపతులతో కలిసి హరీశ్‌రావు భోజనం చేశారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. నిరుపేదల ఆకలి తీర్చుతున్న కోనేరు కోనప్పను మనందరం అభినందించాలన్నారు. పేదల ప్రజల కోసం నిత్య అన్నదాన సత్రాన్ని నడపడం గొప్ప విషయమన్నారు. సమాజ సేవ కోసం పరితపిస్తున్న కోనేరు కోనప్పను ఎమ్మెల్యేలందరూ ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.