Minister Harish Rao | రైతు బజార్లో సౌలత్లు ఎట్లున్నయి ..రైతులను అడిగి తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) ఆదివారం సిద్దిపేటలోని రైతు బజార్(Raitu Bazar)ను ఆకస్మికంగా సందర్శించారు.
సిద్దిపేట : రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) ఆదివారం సిద్దిపేటలోని రైతు బజార్(Raitu Bazar)ను ఆకస్మికంగా సందర్శించారు. రైతులతో మాట్లాడి రైతు బజార్లో నెలకొల్పిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఇంకెమైనా కావాలా? అంటూ రైతులను అడిగారు. గిట్టుబాటు గిరాకీ అయితుందా. సౌలత్లు ఎట్లున్నాయని ఆరాతీశారు.
ములక్కాయలు విక్రయిస్తున్న మహిళా రైతుతో మాట్లాడుతూ గిట్టుబాటు అవుతుందా..లేదా అంటూ వివరాలు అడిగారు. కిలో రూ.50 ధర పలుకుతున్నదని రైతు వివరించింది. ఈ ప్రాంతంలో నీళ్లు బాగానే ఉన్నాయని ఆమె వివరించింది. తాను కూడా ఐదేకరాలు ములక్కాయ పంట పెడతానని మంత్రి హుషారుగా అన్నారు. ఇర్కోడ్ తొక్కులు, మిట్టపల్లి పప్పులు హైదరాబాదు మార్కెట్లో సైతం ఎగుమతి చేయాలని దీని కోసం సంబంధిత అధికారుల సహాయ సహకారాలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజితకు సూచించారు.
నిత్యం వేలాది మంది వచ్చిపోయే రైతు బజారును పరిశుభ్రంగా నిలపాలని ఎస్టేట్ అధికారి ప్రభాకర్‌ను ఆదేశించారు. పరిశుభ్రత పాటించని ప్రదేశాన్ని చూపుతు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

