బాధ్యతగా పని చేసి.. కంటివెలుగు-2ను విజయవంతం చేద్దాం : హరీశ్‌రావు
Minister Harish Rao | అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేద్దామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా కార్యక్రమంపై డీహెచ్‌ఓలు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, క్వాలిటీ టీమ్స్, ప్రోగ్రామ్ ఆఫీసర్లకు
హైదరాబాద్ : అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేద్దామని మంత్రి
హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం
ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా కార్యక్రమంపై డీహెచ్‌ఓలు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, క్వాలిటీ టీమ్స్,
ప్రోగ్రామ్ ఆఫీసర్లకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
హరీశ్‌రావు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ఇంతకు ముందు 1.54కోట్ల మంతికి పరీక్షలు చేసి, 50లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినట్లు తెలిపారు.
కార్యక్రమం ‘వరల్డ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఐ స్క్రీనింగ్ పోగ్రామ్’గా నిలిచిందని చెప్పారు. ప్రజల కంటి సమస్యలు తొలగించేందుకు మరోసారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సారి కోటిన్నర మంతికి పరీక్షలు చేసి, 55లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో 30లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్, 25లక్షల మందికి ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరు కలిసి ప్రజలను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఒకటి రెండుసార్లు ఆలోచించి కార్యక్రమాలు చేపడుతారని, ప్రజల కోణంలోనే ఆలోచిస్తారన్నారు.
ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని, అధికారులంతా పూర్తి బాధ్యతతో పని చేయాలన్నారు. కార్యక్రమానికి ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించిందన్నారు. గతేడాది ఎనిమిది నెల్లలో కార్యక్రమం నిర్వహించగా.. ఈ సారి వంద పని దినాల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలిసారి 827 బృందాలు పని చేస్తే.. ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచినట్లు చెప్పారు. బృందాలకు అవసరమైన ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామని, రెగ్యులర్ సర్వీలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. డీఎంహెచ్ఓలు బాగా పని చేయాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు.
జనవరి 5న కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు. ఎక్కడా ఇబ్బందులు రావొద్దని, సమస్య వస్తే రీప్లేస్ చేయాలని, బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పూర్తి స్థాయిలో ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఆయా బృందాలకు రోజువారీ ప్లానింగ్ ఇవ్వాలని, పరీక్షలు చేయించుకోవడం మిస్సయిన వారి కోసం మళ్లీ ఏర్పాటు చేయాలన్నారు. జనవరి ఒకటి వరకు ఆటో రిఫ్రాక్తో మిషన్లు వస్తాయని, కార్యక్రమం ప్రారంభానికి ముందే రీడింగ్ గ్లాసెస్ అందుబాటులోకి వస్తాయన్నారు.
పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కు సైతం శిక్షణ ఇచ్చి.. సేవలను వినియోగించుకుంటామన్నారు. స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ బృందం, జిల్లాకో క్వాలిటీ కంట్రోల్ బృందాన్ని నియమించి.. కార్యక్రమం ప్రభావవంతంగా జరుగుతుందా? లేదా? పరిశీలించనున్నట్లు చెప్పారు. ఎల్ వీ ప్రసాద్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సహకారంతో సిబ్బందికి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇస్తామని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అద్దాల డిమాండ్ తీర్చేలా ఆటోమేటిక్ ఆర్డర్ ఫెసిలిటి ఉంటుందన్నారు.
ప్రభుత్వం తరఫున అన్ని విధాలా పూర్తి స్థాయి సహకారం ఉంటుందన్నారు. కంటి సమస్యలతో ఏ ఒక్కరూ రాష్ట్రంలో బాధ పడకూడదు అనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దాన్ని అమలు చేయడంలో మనందరిది ముఖ్య పాత్ర అని, లక్ష్యం నెరవేరేలా అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కంటి వెలుగు బాగా పని చేసే వారికి ప్రశంసలు ఉంటాయని, శాఖ పరమైన గుర్తింపు ఉంటుందన్న ఆయన.. విధుల్లో నిర్లక్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గొప్ప కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Promotions | జీపీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఎప్పుడు?.. ఏడు నెలలైనా గ్రేడింగ్‌పై తేల్చని ప్రభుత్వం
Shadow CMO | ఆరో అంతస్తులో ఆయనదే హవా.. సచివాలయంలో సీఎంవోకు సమాంతరంగా షాడో వ్యవస్థ!
Ramayana | బాక్సాఫీస్ వద్ద రామాయణ విధ్వంసం.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు, బుక్ మై షోలో సరికొత్త రికార్డు!
Aarogyasri | ఏడాదిగా జీతాల్లేవ్.. కుటుంబ పోషణ కోసం ర్యాపిడో డ్రైవర్లుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులు
Bigg Boss 10 | వంశీపై నాగార్జున ఫైర్.. వర్షిణికి క్లాస్,కెప్టెన్సీ పోటీకి ముకేశ్ అర్హత!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

