అవసరమైతే నూకలు తింటాం.. కేంద్రాన్ని గద్దె దించుతాం : మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ : అడుగడుగునా తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమానపరుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నూకలు తినమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. బిడ్డ నూకలు తినమని చెప్తావా. అటుకులో, అన్నమో తిని తెలంగాణ సాధించుకున్నాం. అవసరమైతే నూకలు తింటాం.. మిమ్మల్ని గద్దె దించుతాం. ఇది మా రైతులు చేసి చూపిస్తారు. తెలంగాణ ఏదైనా సహిస్తది కానీ అవమానాన్ని సహించదు. సమైక్య పాలకులు మాట్లాడిన మాదిరిగానే ఇప్పుడు పీయూష్ గోయల్ మాట్లాడుతున్నారు. నాడు సమైక్య పాలకులు అవమానిస్తే.. నేడు పీయూష్ గోయల్ అవమానిస్తున్నారు. సమైక్యవాదులకు చరమగీతం పాడాం.. మీకు కూడా ఆరోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
తెలంగాణ భవన్లో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో మరోసారి తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచేలా గోయల్ మాట్లాడారు. మమ్మల్ని నాలుగు మాటలు అంటే పడుతాం. తెలంగాణ రైతాంగాన్ని, ప్రజల్ని అవమానపరిస్తే సహించేది లేదని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. గోయల్‌కు అహంకారింపులు, వక్రీకరణలు అలవాటుగా మారాయి. మా మంత్రులు వెళ్లి యాసంగిలో పండే పంట బాయిల్డ్ రైస్ మాత్రమే అని చెప్పినప్పుడు.. మీ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయించండి అని అవమానించారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాల్సిందే..
తెలంగాణ రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం. రైతుబంధు ఇస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగుకు పుష్కలంగా నీరు అందిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. రైతుల ఆత్మహత్యలు తగ్గి, సంతోషంగా ఉన్నారు. పంజాబ్‌తో తెలంగాణకు లింక్ పెట్టడం సరికాదు. మాయమాటలతో రైతుల్ని మభ్య పెడుతున్నారు. రైతుల్ని మేం కాదు.. మీరే మోసం చేస్తున్నారు. పంజాబ్ బియ్యానికి, తెలంగాణ బియ్యానికి తేడా లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు, ప్రజలకు గోయల్ క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
తోవ చూపించాల్సింది పోయి తొండి మాట్లాడుతున్నారు..
దేశానికి అవసరమయ్యే విత్తనాల్లో 60 శాతం తెలంగాణే అందిస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ ఇస్తామంటే రా రైస్ మాత్రమే ఇవ్వాలని మెలిక పెట్టడమేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అవమానాలను సహించరని తేల్చిచెప్పారు. పీయూష్ గోయల్ ఒక వ్యాపారిలా మాట్లాడుతున్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవడం లేదు. తోవ చూపించాల్సింది పోయి తొండి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధమ్కీలు ఇచ్చింది మీరే..
ధమ్కీ ఇచ్చేది మేం కాదు.. మీరు ఇస్తున్నారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈడీ, ఐటీ దాడులు చేస్తామని ధమ్కీలు ఇస్తున్నారు. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్త రాస్తే వారికి ధమ్కీలు ఇచ్చి దాడులు చేయిస్తున్నారు. రైతుల పక్షాన నిలబడి గొంతెత్తి ధాన్యం కొనమని అడగడం ధమ్కీ కానే కాదు. ఇది కేవలం డిమాండ్ మాత్రమే. ధమ్కీల సంస్కృతి బీజేపీది అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
రైతుల పెట్టుబడి రెట్టింపు..
డబ్ల్యూటీవో ఒప్పందాలను మార్చగలిగే శక్తి రైతులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మీరే ఆ ఒప్పందాలను మార్చాలని కేంద్రానికి సూచించారు. ఎనిమిదేండ్ల నుంచి మీరే అధికారంలో ఉన్నారు. ఆ ఒప్పందాలను మార్చి రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడాలి. పీయూష్ గోయల్ బెదిరింపు ధోరణితో, అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. ఆదాయం రెట్టింపు చేయకుండా, రైతుల పెట్టుబడిని రెట్టింపు చేశారు. ఎరువుల ధరలు రెట్టింపు అయ్యాయి. వ్యవసాయాన్ని లాభదాయకంగా చేస్తామని చెప్పి రైతులను అప్పుల ఊబిల్లోకి దింపారు. రైతులకు బీజేపీ చేసిందేమీ లేదు. అన్యాయం చేశారు. రైతులపై కార్లు ఎక్కించి నడిరోడ్డుపై హత్య చేసిన చరిత్ర బీజేపీది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

