బీజేపీ నేతలే విచ్ఛిన్నకర శక్తులు : మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలే విచ్ఛిన్నకర శక్తులు అని మండిపడ్డారు. మోదీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌కు వచ్చి చిల్లర మాటలు మాట్లాడిపోయారని విమర్శించారు. మోదీ ఆయన స్థాయికి తగిన మాటలు మాట్లాడలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
నాడు తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉద్యమాన్ని విచ్చిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ బీజేపీ పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి అధికారంలోకి వచ్చే మోసం చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్నారు. ఓట్ల కోసం మతకల్లోల్లాలు సృష్టించాలని చూస్తున్నారు. బీజేపీ నేతలే విచ్ఛిన్నకర శక్తులు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇవాళ్టి హైదరాబాద్ పర్యటనలో తెలంగాణ ప్రజలకు మేలైన విషయాలు చెప్తారని ఆశించాం.. విభజన చట్టంలోని సమస్యలపై స్పందిస్తారని అనుకున్నాం.. కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు.
కేసీఆర్‌ది కుటుంబ పార్టీ కాదు..
కేసీఆర్‌ది కుటుంబ పార్టీ కాదు.. తెలంగాణే ఓ కుటుంబం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణనే ఓ కుటుంబంగా భావించి పరిపాలించే నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదు. ఎనిమిదేండ్లలో తెలంగాణకు మోదీ ఏం ఇచ్చారో చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వస్తమనేది పగటి కలే. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కుటుంబ రాజకీయాలపై మోదీ మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందన్నారు హరీశ్‌రావు.
గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అడిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీ మంచిపార్టీ. ఆ రోజు కుటుంబ పార్టీ కాదు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా మీకు కనబడుతుందా? అని మంత్రి ప్రశ్నించారు. అమిత్ షా కుమారుడు బీసీసీఐకి సెక్రటరీ అయిండు. ఎలా అవుతాడు. ఆయనేమైనా క్రికెటర్‌రా? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తమిళనాడులో డీఎంకేతో, ఏపీలో టీడీపీతో, పంజాబ్‌లో అకాలీదళ్‌తో పొత్తుపెట్టుకున్నప్పుడు.. అవి కుటుంబ పార్టీలు అని గుర్తుకు రాలేదా? మీ తప్పులు ఎత్తిచూపితే కుటుంబ పార్టీ అంటారా? అని హరీశ్‌రావు నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

