Minister Harish rao | జర్నలిస్టులకు అండగా సీఎం కేసీఆర్: మంత్రి హరీశ్ రావు
తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సమాజ హితంకోసం కృషిచేసే వృత్తి జర్నలిజమని చెప్పారు.
ఆందోల్: తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సమాజ హితంకోసం కృషిచేసే వృత్తి జర్నలిజమని చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 12 వేల అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉంటే, తెలంగాణలో 21,295 అక్రిడేషన్లు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ (CM KCR) ప్రత్యేకంగా జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు ఇచ్చారని తెలిపారు. రూ.15 కోట్లతో మీడియా భవన్ (Media bhavan) నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. ఆందోల్ (Andole) నియోజకవర్గంలోని జర్నలిస్టులకు (Journalists) మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నదని చెప్పారు.
ప్రజలకు వాస్తవాలను చెప్పే బాధ్యత జర్నలిస్టులదేనని వెల్లడించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చొరవతో నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం సంతోషంగా ఉందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ (Allam Narayana) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జర్నలిస్టులకు కష్టసుఖాల్లో సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని చెప్పారు. మీడియా భవన్ కట్టించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 వేల అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు చొరవతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యమైందన్నారు.

Harishrao 1
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

