కొత్తపల్లి (కరీంనగర్) : తెలంగాణ ప్రభుత్వం సాగు,తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణ దేశంలోనే సస్యశ్యామలం రాష్ట్రంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)తో రాష్ట్రంలోని జలవనరులు కళకళలాడుతున్నాయనిపేర్కొన్నారు.
ఆదివారం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో(Decade Celebrations) భాగంగా మిషన్ భగీరథ (Mission Baghiratha0శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం ఎలగందల్ ఫిల్టర్ బెడ్ వద్ద నిర్వహించిన తెలంగాణ మంచినీళ్ల పండుగలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య రాష్ట్రంలో నీళ్ల కోసం అరిగోస పడ్డామని వెల్లడించారు . గోదావరి తలాపున పారుతున్నా తెలంగాణలో మేలు జరిగేది కాదని అన్నారు. బావులు, బోర్లు ఎండి పోయి నీళ్ల కోసం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లేవారని తెలిపారు. వర్షాకాలంలో మానేరులాంటి రిజర్యాయర్లలల్లో నీళ్లున్నా కరెంటు లేక పంటపొలాలకు నీళ్లు అందేవి కావని పేర్కొన్నారు.
గోదావరి నీళ్లను సింగరేణి బొగ్గు గనులను తెలంగాణ అభివృద్దికి ఏమాత్రం వినియోగించలేదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతొ ఒక్కసారిగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మిషన్ భగీరథతో తాగు నీటి కష్టాలు దూరమయ్యాయని మంత్రి వెల్లడించారు. వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు మిషన్ కాకతీయ, రైతు బంధు(Raitu Bandu), రైతు బీమా, ఉచిత కరెంట్, అందుబాటులో ఎరువులు, విత్తనాలు అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు , కొత్తపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు, అధికారులు పాల్గొన్నారు.