Minister Gangula | బండి సంజయ్ డబ్బులు, మద్యం పంపిణీ చేయలేదని భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేస్తావా? వీడియో
Minister Gangula | బీఆర్ఎస్(BRS) మంచి మెజార్టీతో నాలుగోసారి విజయం సాధించబోతున్నదని, దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా మేము మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోబపెట్టేందుకు డబ్బుల పంపిణీకి వెళ్లిన బండి సంజయ్(Bandi Sanjay) సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టారు.
కరీంనగర్ : బీఆర్ఎస్ (BRS) మంచి మెజార్టీతో నాలుగోసారి విజయం సాధించబోతున్నదని, దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా మేము మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోబపెట్టేందుకు డబ్బుల పంపిణీకి వెళ్లిన బండి సంజయ్(Bandi Sanjay) సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరీంనగర్లో బండి సంజయ్ అకృత్యాలతో ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని బండి సంజయ్‌ని ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌కి నిరాశే మిగిలింది.
ధర్మం కోసం అని దేవుడి పేరు చెప్పే బండి సంజయ్ ఒక్క గుడికి పైసా ఇవ్వలేదని విమర్శించారు. మేము వెంకటేశ్వర స్వామి గుడి, ఇస్కాన్ కడుతుంటే బండి సాయం ఏది?ఎంపీగా బండి సంజయ్ ఘోరంగా విఫలం అయ్యారని మండిపడ్డారు.
నిన్న ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి బీజేపీ వాళ్లు డబ్బులు, మద్యం పంపిణీ చేశారు. బండి సంజయ్ కొత్తపల్లిలో చాలా దారుణంగా వ్యవహరించాడు. పార్లమెంటు సభ్యుడి స్థాయిలో హుందాగా ఉండాల్సిన వారు అలా చేయడం ఏంటి ?
సంజయ్ డబ్బులు, మద్యం పంపిణీ చేయలేదని భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేస్తారా..? అని సవాల్ విసిరారు.
నిన్న కొత్తపల్లిలో డబ్బులు పంపిణీ చేస్తుంటే మా వాళ్లు పట్టుకున్నారు. డబ్బులు పంచుతూ బండి సంజయ్ అడ్డంగా దొరికిపోయి, రివర్స్‌లో అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని గొడవ చేశారు. బండి సంజయ్ డబ్బులు పంచారని సీసీ ఫుటేజీలో చాలా క్లియర్ గా కనిపించిందన్నారు. ఇంట్లో ఉన్న మా కార్యకర్తపై స్వయంగా దాడులు చేసాడు. మేము డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తున్న సంజయ్ మొదట పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని సూటిగా ప్రశ్నించారు.
ఒక ఎంపీవి అయి ఉండి గుండాలను తీసుకుపోయి దాడులు చేస్తావా..ఇంట్లో ఉన్న కార్యకర్తను కొట్టి బూతులు తిడతావా? ఇదేనా దేశం, కోసం ధర్మం కోసం పని చేయడమని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ చూపెట్టిన ఓటర్ లిస్ట్ వారి కారులోనే దొరికింది. మా మీద బురద చల్లుతున్నాడు. లక్ష సెల్ ఫోన్లు అని ప్రచారం చేసిన సంజయ్ అవి ఎక్కడ ఉన్నాయి. నిజంగా మేము పంచినట్లయైతే ఒక్కటైనా చుపించాలిగా ? సీఎంఓ నుంచి అధికారులు వచ్చి డబ్బులు ఎందుకు పంచుతారన్నారు. మళ్లీ నీ బూటకపు మాటలు నమ్మే స్థితిలో కరీంనగర్ ప్రజలు లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ ఓడిపోవడం ఖాయమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

