కరోనా కష్టకాలంలో అమ్మలా ఆదరించిన ఘనత వారి సొంతం : మంత్రి ఎర్రబెల్లి
జనగామ : కరోనా కష్టకాలంలో కొవిడ్ బాధితులను అమ్మలా అక్కున చేర్చుకున్నది ఆశ కార్యకర్తలు. ఆ సమయంలో వారి సేవలు వెలకట్టలేనివని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
బుధవారం ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను పాలకుర్తిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జిల్లాలో 520 మంది ఆశా కార్యకర్తలందరికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
గ్రామ స్థాయిలో మొదటగా కనిపించే ఆరోగ్య సిబ్బంది ఆశ కార్యకర్తలు. కరోనా సమయంలో వారి సేవలు అమోఘం అన్నారు.
సొంత కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేని స్థితిలో..ఆశాలు పట్టించుకుని కాపాడిన ఘనత వారి సొంతమన్నారు.
100శాతం వ్యాక్సినేషన్ ను పూర్తి చేసిన రికార్డు కూడా వారికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాక ముందు ఆశాల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ వారి జీతాలను పెంచి ఆదుకున్నారన్నారు.
అందరికి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

