Minister Errabelli | గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన : మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | సత్యం, అహింస మార్గాన బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్‌లో వారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
హన్మకొండ : సత్యం, అహింస మార్గాన బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్‌లో వారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అహింసా మార్గంలో ఏదైనా చేయగలం అని నిరూపించిన వ్యక్తిగా గాంధీజీ చరిత్రలో నిలిచిపోయారన్నారు.
గాంధీ చూపిన అహింసా మార్గంలో స్వరాష్ట్రం సాధ్యం చేసి, వలసలు తగ్గించిన గొప్ప నేత సీఎం కేసీఆర్. దేశానికి గాంధీజీ స్వాతంత్య్రం తెస్తే, మన రాష్ట్రానికి కేసీఆర్ స్వాతంత్ర్యాన్ని తెచ్చారని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ గ్రామాలను అభివృద్ది చేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని కడిగిన ముత్యంలా తయారు చేశాం. మన గ్రామాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు.
స్వచ్ఛ భారత్‌లో మన రాష్ట్రమే నంబర్ వన్‌గా నిలిచామన్నారు. ఇవే గాక రైతులకు నూతన రెవెన్యూ చట్టం, రైతు బంధు,రైతుబీమా లాంటి పథకాలతో రైతుల కష్టాలు తీరుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కూడా చైర్మెన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

