హనుమకొండ : కరుణ, ప్రేమ, సేవ అన్న క్రీస్తు బోధనలు(Christ’s teachings)అందరికీ ఆచరణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. హనుమకొండ జిల్లా పెద్ద పెండ్యాల కరుణాపురం క్రీస్తు జ్యోతి చర్చిని ప్రారంభించిన సందర్భంగా ఏసు భక్తులతో కలిసి మంత్రి చర్చిలో ప్రార్థనలు చేశారు.
ఆయన మాట్లాడుతూ ‘ క్రీస్తు(Christ ) బాటలో నడిస్తే ప్రపంచంలో మోసాలు, పాపాలు ఉండవని, యుద్ధాల(War)కు ఆస్కారం లేదని అన్నారు.అన్ని మతాల సారం మానవత్వమే. అన్ని మతాలకు దేవుడు ఒక్కడే .ఈ బోధనల ప్రేరణతో సీఎం కేసీఆర్(CM KCR) పరిపాలన చేస్తున్నారని’ పేర్కొన్నారు.దాదాపు 150 కోట్లతో ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చిని నిర్మించిన పాల్ సన్ రాజ్ అతని బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.
తెలంగాణలో క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి(Welfare) ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. వారి ఆత్మగౌరవం పెంపొందించేలా 2 ఎకరాల స్థలంలో రూ. 10 కోట్లతో క్రిస్టియన్ భవనం నిర్మిస్తున్నామని అన్నారు.గతంలో ఎప్పుడూ లేనివిధంగా చర్చిల నిర్మాణానికి, మరమ్మతులకు, ఆధునీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టేందుకు అనుమతినిచ్చిన ఏకైక ప్రభుత్వమని తెలిపారు.క్రిస్టియన్ విద్యార్థులకు, యువత కోసం పలు కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. క్రిస్టియన్లు కేసీఆర్కు మద్దతుగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ పాల్ సన్ రాజ్, గోపు జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.