వరంగల్: ఈ నెల 16, 17, 18 తేదీలలో నిర్వహించనున్న తెలంగాణ సమైక్య వజ్రోత్సవాల విజయవంతానికి నియోజకవర్గాల వారీగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లను ఇన్చార్జీలుగా నియమించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వారు ఆయా నియోజకవర్గాల్లో ఈ నాలుగు రోజుల పాటు ఉండి, ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జీగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మెట్టు శ్రీనివాస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జీగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జీగా జనగామ జడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జీగా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జీగా వరంగల్ మహానగర్ మేయర్ గుండు సుధారాణి, పరకాల నియోజకవర్గ ఇన్చార్జీగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జీగా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, వర్దన్నపేట నియోజకవర్గ ఇన్చార్జీగా డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు,
మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జీగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, రెడ్కో చైర్మన్ వై.సతీశ్ రెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జీగా వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జీగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవిందర్ రావు, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీగా రైతు విమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్లను నియమించినట్లు మంత్రి వెల్లడించారు.