మలి దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ : ఎర్రబెల్లి దయాకర్‌రావు
హైదరాబాద్ : మలి దశ తెలంగాణ ఉద్యమానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, చీఫ్‌విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్‌తో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంకుశ నిజాం రజాకార్లను, దేశ్‌ముఖ్‌లను ఎదుర్కొన్న వీరవనిత అని కొనియాడారు.
ఆమె జయంతి, వర్ధంతిని ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ చూపుతూ ఆనాటి దేశ్‌ముఖ్‌లు, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిందన్నారు. ఒక వైపు సాయుధ పోరాటం చేస్తూనే, మరోవైపు అమ్మలా ఉద్యమకారులకు అన్నం పెట్టి ఆదరించిన మహనీయురాలన్నారు. ఐలమ్మ భూపోరాటం విజయంతో అప్పటి ఉద్యమ నాయకులు అప్పటి దొరల భూములు పేదలకు పంచారన్నారు. ఐలమ్మ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారన్నారు. పరిపాలనలో ఉద్యమ స్ఫూర్తిని పాటిస్తున్నారని, అందుకే తెలంగాణ అన్నిరంగాల్లో అగ్రగామిగా మారిందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

