హైదరాబాద్ : ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సన్మానించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడురు గ్రామానికి చెందిన రామయ్య 98వ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్లోని విద్యానగర్లోని ఆయన నివాసంలో కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పూలమాల వేసి, సత్కరించారు. ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం రామయ్య నుంచి మంత్రి ఆశీస్సులను స్వీకరించారు. మంత్రి వెంట అరుణోదయ విమలక్క, వందేమాతరం ఫౌల్క్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.