హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు విద్యాశాఖ రూ. 137. 4కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం మూడు వేర్వేరు జీవోలను జారీ చేశారు. 9, 10 తరగతులకు మధ్యాహ్న భోజనం సమకూర్చేందుకు రూ. 22.02 కోట్లు, 1 నుంచి 8 తరగతుల వారికి కోడిగుడ్లు అందజేసేందుకు రూ. 17.82 కోట్లు, కుక్ కమ్ హెల్పర్లకు పారితోషికం చెల్లించేందుకు రూ. 97.56కోట్ల నిధులను విడుదలచేసింది. ఇక అద్దె భవనాల్లో నడుస్తున్న బడులకు రూ. 3.49 కోట్లు విడుదల చేస్తూ మరో జీవో జారీ చేశారు.