ఎయిర్‌పోర్టుకు మెట్రో
- సిద్ధమైన డీపీఆర్.. రెండేండ్లలో పూర్తిచేసేలా చర్యలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి మణిహారంలా ఉన్న మెట్రో రెండోదశకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న 69 కిలోమీటర్లకు తోడు మరో 80 కిలోమీటర్ల మేర మెట్రోకారిడార్ నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. అత్యంత కీలకమైన ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మార్గానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందుకోసం హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేశారు. ఇందులో హైదరాబాద్ మెట్రో రైలుతోపాటు హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, జీఎంఆర్ ఎయిర్‌పోర్టుతో కలిసి ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ కారిడార్ నిర్మాణం కోసం ఢిల్లీ మెట్రోరైలు సంస్థతో డీపీఆర్‌ను సైతం సిద్ధంచేశారు. శంషాబాద్ మెట్రో కారిడార్‌కు భూసేకరణ అవసరం లేకపోగా.. సుమారు 4 వేల కోట్లు వెచ్చిస్తే సరిపోతుందని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించింది. హెచ్ఎండీఏతోపాటు టీఎస్ఐఐసీ, జీఎంఆర్ ఎయిర్‌పోర్టు సైతం కొంత మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనికితోడు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం ద్వారా రెండేండ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR Tour Photos | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అడుగడుగునా నీరాజనం.. ఫోటోలు
Home Guard Killed | బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం.. నవంబర్ 4న హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్!
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

