RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పాఠశాల గదిలో ఓ విద్యార్థినిపై జరిగిన ఈ అమానుష దాడిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సమాజంలో పెరుగుతున్న హింసకు, నేర ప్రవృత్తికి సినిమాలే ప్రధాన కారణమంటూ జరుగుతున్న చర్చపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
సమాజంలో జరిగే నేరాలకు, సినిమాలకు ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. సమాజంలో హింస పెరగడానికి సినిమాలను బ్లేమ్ చేయడం అంటే.. కిడ్నాప్‌లు పెరగడానికి రామాయణాన్ని బ్లేమ్ చేసినట్లే ఉంటుంది అంటూ ఒక బలమైన కౌంటర్ ఇచ్చారు.
సినిమాలు కేవలం వినోదం కోసం, కల్పిత కథలతో తెరకెక్కించే దృశ్య రూపాలు మాత్రమేనని ఆర్జీవీ పేర్కొన్నారు. తెరపై వచ్చే పాత్రల ప్రవర్తనను చూసి ప్రతి ప్రేక్షకుడు అలాగే తయారవుతాడనడంలో ఎలాంటి అర్ధం లేదని ఆయన స్పష్టం చేశారు. రాప్తాడు ఘటన నేపథ్యంలో సమాజంపై, యువతపై సినిమాల ప్రభావం గురించి తీవ్రమైన వాదనలు నడుస్తున్న తరుణంలో ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కేవలం సినిమాలను తప్పుపట్టడం కంటే నేరాలకు అసలు కారణాలు ఏమిటో విశ్లేషించాలనే కోణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Blaming films for rise in violence is like , blaming Ramayana for rise in kidnappings
— Ram Gopal Varma (@RGVzoomin) November 1, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

