Home Guard Killed | బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
Home Guard Killed | బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీస్ సిబ్బంది హెచ్చరించారు. ఒక గుడి సమీపంలో వారు మళ్లీ మద్యం సేవిస్తూ కనిపించడంతో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు వ్యక్తులు ఒక హోమ్ గార్డును కొట్టి చంపారు.
చెన్నై: బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీస్ సిబ్బంది హెచ్చరించారు. ఒక గుడి సమీపంలో వారు మళ్లీ మద్యం సేవిస్తూ కనిపించడంతో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు వ్యక్తులు ఒక హోమ్ గార్డును కొట్టి చంపారు. (Home Guard Killed) తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 29న రాత్రి వేళ తలవాయి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ రాజకన్ను, హోమ్ గార్డు వెంకటేశన్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్నారు. ఒక ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తూ కనిపించారు. పోలీసులు వారిని హెచ్చరించారు. అక్కడి నుండి వెళ్లిపోవాలని చెప్పారు.
కాగా, తెల్లవారుజామున ఆ ముగ్గురు వ్యక్తులు వినాయక ఆలయం సమీపంలో మద్యం తాగుతూ మళ్లీ కనిపించారు. కానిస్టేబుల్ రాజకన్ను, హోమ్‌గార్డు వెంకటేశన్ వారిని ప్రశ్నించగా ఆ ముగ్గురు వ్యక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కానిస్టేబుల్‌ను నిర్బంధించి హోమ్‌గార్డ్ వెంకటేశన్‌పై దాడికి పాల్పడ్డారు. ఆయన తల, ముఖంపై పదేపదే కొట్టారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశన్ అక్కడ స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ ఇద్దరిని
సెందురై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన హోమ్‌గార్డు వెంకటేశన్‌ను మొదట తిరుచిరాపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి షిఫ్ట్ చేయగా చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. దీంతో నిందితులైన సిలప్పనూరు గ్రామానికి చెందిన మధివనన్, తమరైకన్నన్, పరిధిని అక్టోబర్ 31న పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dies
- drinking
- Home Guard
- Objects
RELATED ARTICLES
తాజా వార్తలు
Home Guard Killed | బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం.. నవంబర్ 4న హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్!
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

