Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం.. నవంబర్ 4న హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్!
Megaverse | మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి వ్యాఖ్యాతగా రాబోతున్న సెలబ్రిటీ టాక్ షో ‘మెగావర్స్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
Megaverse | మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి వ్యాఖ్యాతగా రాబోతున్న సెలబ్రిటీ టాక్ షో ‘మెగావర్స్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ షోకు సంబంధించిన అధికారిక ప్రోమో గురించి ఓ కీలక అప్డేట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ‘మెగావర్స్’ ప్రోమోను తెరకెక్కించే బాధ్యతలను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్నది హరీష్ శంకర్ చిరకాల కోరిక. ఇప్పుడు పూర్తిస్థాయి సినిమా కాకపోయినా, ఈ ప్రత్యేక ప్రోమో ద్వారా చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం ఆయనకు దక్కినట్లు తెలుస్తోంది.
చిరంజీవిలోని పాత తరం మాస్ స్వాగ్, స్టైలిష్ లుక్, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను హరీష్ శంకర్ తనదైన శైలిలో చూపించనున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఆయన మార్క్ పంచ్‌లు, భారీ విజువల్స్‌తో ఈ ప్రోమోను ప్రత్యేకంగా రూపొందించనున్నట్లు సమాచారం.ఈ ప్రత్యేక ప్రోమో చిత్రీకరణను నవంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. భారీ ఏర్పాట్ల మధ్య ఈ షూటింగ్ జరగనుందని ప్రచారం సాగుతోంది. ప్రోమోలో చిరంజీవితో పాటు మెగా కుటుంబానికి చెందిన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కూడా ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారనే వార్త మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఒకే వేదికపై ఈ ముగ్గురు మెగా స్టార్లను చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘మెగావర్స్’లో అలాంటి అరుదైన దృశ్యం ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ రావలసి ఉంది. ఇక ఈ టాక్ షోలో భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు, స్టార్ సెలబ్రిటీలు పాల్గొననున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు ప్రముఖులతో ప్రత్యేక ఎపిసోడ్ల చిత్రీకరణ జరుగుతోందని ప్రచారం ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రూపొందిస్తున్న ప్రోమోను నవంబర్ నెలాఖరులో విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం.. నవంబర్ 4న హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్!
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

