బడుల్లో మెంటార్ టీచర్లు!
బడుల్లో చిన్నారులు తమ సమస్యను చెప్పుకొనేందుకు టీచర్లలో ఒకరిని మెంటార్‌గా నియమించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
- పిల్లల భద్రతకు మార్గదర్శకాల రూపకల్పన
- పలువురి నుంచి సూచనలు,సలహాలు స్వీకరించిన త్రిసభ్య కమిటీ
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : బడుల్లో చిన్నారులు తమ సమస్యను చెప్పుకొనేందుకు టీచర్లలో ఒకరిని మెంటార్‌గా నియమించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఏదైనా ఆపద తలెత్తినా, వేధింపులు చోటుచేసుకొన్నా వెంటనే మెంటార్ టీచర్లకు చెప్పుకొనేలా మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. బడుల్లో పిల్లల భద్రత, రక్షణకు పటిష్ఠ మార్గదర్శకాల రూపకల్పన కోసం ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్చాఆర్డీలో పలు వర్గాలతో సమావేశమైంది. ఈ సందర్భంగా నల్సార్ వర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్, పోలీసుశాఖ, యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుంచి పలు సూచనలు, సలహాలు స్వీకరించింది. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఐపీఎస్ అధికారి సుమతి పాల్గొన్నారు.
యాజమాన్యాలు బాధ్యత వహించాలి : డీజీపీ మహేందర్‌రెడ్డి
విద్యారంగంలో టెక్నాలజీపరంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న క్రమంలో పిల్లల్ని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఏర్పడిందని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో పిల్లల భద్రత, రక్షణ ముఖ్యమని, ఈ విషయంలో యాజమాన్యాలు బాధ్యత వహించాలని సూచించారు. ఇందుకు వ్యవస్థీకృతమైన మార్గదర్శకాలను రూపొందించాలని డీజీపీ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుశాఖతో సమన్వయం చేసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

