హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్య వసాయ వర్సిటీలో సోమవారం 56.57.58 మెగా స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 2,135 మంది అండర్ గ్రాడ్యుయే ట్స్, 480 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 129 మందికి పీహెచ్డీ పట్టాలు అందజేశారు. పీహెచ్డీ 6, 26 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 64 మంది అండర్ గ్రాడ్యుయేట్స్‌కి బంగారు పతకాలు ఇచ్చారు. అంతర్జాతీయ వ్యవసాయరంగ నిపుణుడు డాక్టర్ ప్రభుపింగళికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.