Medico Preethi Case | విషమంగానే వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల చేసిన నిమ్స్
Medico Preethi Case | వరంగల్ (Warangal) కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు తాళలేక పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం నిమ్స్(NIMS)లో చికిత్స కొనసాగుతున్నది. అయితే, ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Medico Preethi Case | వరంగల్ (Warangal) కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో సీనియర్ వేధింపులు తాళలేక పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం నిమ్స్ (NIMS)లో చికిత్స కొనసాగుతున్నది. అయితే, ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుపడ లేదని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. నిపుణుల బృందం ఆధ్వర్యంలో విద్యార్థినికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మరోసారి రాత్రి 8 గంటలకు ప్రీతి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, ప్రీతి బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు తెలిపినట్లు కుటుంబీకులు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ ఏమాత్రం ఆశలు లేవని వైద్యులు తెలిపారని, మొదటిరోజుతో పోలిస్తే ఇంకా పరిస్థితి ఇంకా క్షీణించిందని చెప్పారు. ప్రీతి శరీరం రంగు కూడా మారిపోయిందన్నారు. ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఆశించామన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఇందుకు కారణమైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రీతిది ఆత్మహత్యా యత్నం కాదని.. ఇది ముమ్మూటికి హత్యేనన్నారు. సైఫే తమ కూతురిని హత్య చేశాడన్నారు. ప్రీతి జోలికి రాకుండా సైఫ్‌ను నియంత్రించలేకపోయారని, సమస్యను హెచ్ఓడీ సరిగా హ్యాండిల్ చేయలేదని ఆరోపించారు. ఆ రోజు ఉదయం 4.30 గంటలకు ఘటన జరిగితే 8 గంటల వరకు తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రీతి మొబైల్లో వారికి కావాల్సినట్లు సాక్ష్యాలు క్రియేట్ చేసుకున్నారన్నారు.
ఇదిలా ఉండగా.. నిమ్స్ వద్ద పోలీసులు భద్రతను పెంచారు. పోలీస్ భద్రతను పెంచాలని నిమ్స్ డైరెక్టర్ సూచించగా.. ఈ మేరకు భద్రత పెంచారు. మరో వైపు వైపు ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. తన ఆవేదనను తల్లితో పంచుకున్నది. సైఫ్ తనతో సహా చాలా మంది జూనియర్లను వేధిస్తున్నారని తల్లితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. సీనియర్లు అంతా ఒకటిగా ఉన్నారని బాధపడింది. పోలీసులతో సైఫ్‌కు నాన్న ఫోన్ చేయించినా లాభం లేదని తల్లితో చెప్పుకుంటూ కుమిలిపోయింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటై తనను దూరం పెడతారని, ఏదైనా సమస్య ఉంటే తన దగ్గరికి రావాలని హెచ్ఓడీ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పింది. ఈ మాటలు విన్న తల్లి సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని కూతురికి ధైర్యం చెప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

