Medico Preethi case | సైఫ్ నాతోపాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు.. తల్లితో ఫోన్లో మాట్లాడిన ప్రీతి!
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికల్ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) ఆత్మహత్యాయత్నం కేసులో ఆడియో వెలుగులోకి వచ్చింది. సీనియర్ అయిన సైఫ్ (Saif) తనతోపాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని (Ragging), సీనియర్లంతా ఒక్కటిగా ఉన్నారని ఫోన్లో తన తల్లికి బాధను చెప్పుకున్నది.
Medico Preethi case | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికల్ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) ఆత్మహత్యాయత్నం కేసులో ఆడియో వెలుగులోకి వచ్చింది. సీనియర్ అయిన సైఫ్ (Saif) తనతోపాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని (Ragging), సీనియర్లంతా ఒక్కటిగా ఉన్నారని ఫోన్లో తన తల్లికి బాధను చెప్పుకున్నది. ఆత్మహత్యాయత్నానికి ముందురోజు ప్రీతి తన తల్లితో మాట్లాడినట్లు తెలుస్తున్నది.
సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో (Warangal MGM) పీజీ విద్యార్థిని (PG Student) ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని నిమ్స్‌లో (NIMS) చికిత్స పొందుతున్నది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నదని వైద్యులు వెల్లడించారు. అయితే తాజాగా ఫోన్లో తన తల్లితో బాధను పంచుకున్నట్లు ఆడియో ఒకటి బయటకు వచ్చింది. సైఫ్ తనతోపాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని అందులో పేర్కొన్నది. సీనియర్లు అంతా ఒక్కటిగా ఉన్నారని ఆవేదన వ్యక్తంచేసింది.
పోలీసులతో సైఫ్‌కు నాన్న ఫోన్ చేయించినా లాభం లేదని, వేధింపులు రోజురోజుకు అధికమవుతున్నాయని తెలిపింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒక్కటై తనను దూరం పెడతారని చెప్పింది. ఏదైనా సమస్య ఉంటే తన దగ్గరికి రావాలని హెచ్‌వోడీ ఆగ్రహం వ్యక్తం చేశాడని వెల్లడించింది. కూతురు మాటలు విన్న తల్లి.. సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తామని ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. అయితే మరుసటి రోజే ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

