Medico Preethi case | సైఫ్ నాతోపాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు.. తల్లితో ఫోన్‌లో మాట్లాడిన ప్రీతి!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికల్‌ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) ఆత్మహత్యాయత్నం కేసులో ఆడియో వెలుగులోకి వచ్చింది. సీనియర్‌ అయిన సైఫ్‌ (Saif) తనతోపాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని (Ragging), సీనియర్లంతా ఒక్కటిగా ఉన్నారని ఫోన్‌లో తన తల్లికి బాధను చెప్పుకున్నది.