కరీంనగర్ రూరల్, జూన్ 13: కరీంనగర్ మండలం నగునూర్‌లోని ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎంఎస్)లో ‘డయాబెటిస్ వైద్య రంగంలో తాజా పరిణామాలు, చికిత్స, విధానాలు’పై ప్రత్యే క శాస్త్రీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటిక్స్ ఇన్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జీ దీప తె లిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే ఈ సదస్సు లో రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లు 800మంది పాల్గొంటార ని పేర్కొన్నారు. డయాబెటిస్ ని యంత్రణ, ఆధునిక చికిత్సా విధానా లు, రోగుల సంరక్షణలో నూతన మార్గదర్శకాలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. అలాగే నిపుణులతో చర్చలు, సందేహ, ని వృత్తి కార్యక్రమాలు జరుగుతాయని, వైద్య నిపుణులు, వైద్య విద్యార్థులు, ఆరోగ్య రంగానికి చెందిన ప్రతినిధు లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.