హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : టీజీజీడీఏ కార్యవర్గం ఎన్నిక షె డ్యూల్‌ను ఆదివారం అసోసియేషన్ విడుదల చేసింది. హైకోర్టు అనుమతితో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తె లిపింది. హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్లు జీఎం మొహియుద్దీన్, న్యాయపతి ప్రశాంత్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నట్టు పేర్కొంది. నేడు నోటిఫికేషన్ విడుదల చేసి 19 వరకు నామినేషన్లు స్వీకరించనున్నా రు. 20న నామినేషన్ల పరిశీలన అనంతరం జాబితాను విడుదల చేయనున్నారు. 29న కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గెస్ట్‌హౌస్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వర కు పోలింగ్ జరుగనున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎన్పీఏ డైరెక్టర్ అమిత్‌గార్గ్ అకాడమీలోని వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పించారు. 1948 సెప్టెంబరు 15న రాజస్థాన్‌లోని మౌంట్‌అబూలో సెం ట్రల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ స్థాపించారు. అయితే, ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు వచ్చే వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దానిని 1975లో హైదరాబాద్‌కు మార్చారు. అప్పుడే వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీగా నామకరణం చేశారు.