BFSI | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): కోర్సు పూర్తికాగానే జాబ్ గ్యారెంటీ కోర్సులను ఇప్పుడు డిగ్రీలో ప్రవేశపెడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)కోర్సును అందుబాటులోకి తెచ్చా రు. డిగ్రీతోపాటు ఇంజినీరింగ్సహా ఎవరైనా ఈ కోర్సును తీసుకోవచ్చు.
ప్రస్తుతం ఇంజినీరింగ్లో ఈ ఏడాది 5 వేల మంది, ఇంజినీరింగేతర కోర్సుల్లో 5 వేల మందికి ప్రవేశాలు కల్పిస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ కోర్సు పూర్తిచేసినవారికి జేపీ మోర్గాన్, లండన్ స్టాక్ ఎక్సేంజ్, స్టేట్ స్ట్రీట్, హెచ్ఎస్బీసీ వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఈ మేరకు ఇటీవలే ఆయా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నట్టు పేర్కొన్నారు.
బీఎఫ్ఎస్ఐ కోర్సు ప్రత్యేకతలు..