మర్రిగూడ, సెప్టెంబర్ 8 : ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై నల్లగొండ జిల్లా మును గోడు నియోజకవర్గంలోని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని పోర్లగడ్డతండా, ఆంబోతు తండాకు చెందిన 60 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, 5వ వార్డు సభ్యుడు వడ్త్యాహతీరాం, ఐదుదోనల తండాకు చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.