నల్లగొండ : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్‌వన్‌గా కొనసాగుతుదన్నదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో పట్టణంలోని 5, 21 వ వార్డులకు చెందిన 200 మంది కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరందరికీ గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొద్ది కాలంలోనే.. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ సుభిక్షం చేశారని, సబ్బండ వర్గాలు కేసీఆర్ నాయకత్వంలో సంతోషంగా ఉన్నారన్నారు.
అందుకే అన్ని వర్గాల వారు కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసంతో పార్టీలో చేరుతున్నారని, అందర్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్, పట్టణ పార్టీ కార్యదర్శి బోనగిరి దేవేందర్, ఐదో వార్డ్ కౌన్సిలర్ పున్న గణేష్ పాల్గొనగా మహమ్మద్ ఫయాజ్ నాయకత్వంలో సమీయొద్దీన్, ఆసిఫ్, ఫర్వేజ్, ఎండీ నదీం, రిజ్వాన్, సమిర్, భరత్, బిలాల్, నరేష్ లతో పాటు 200 మంది వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరారు.