హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమైన విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో బుధవారం చో టుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రం లో భారీ పేలుడు సంభవించి మం టలు ఎగిసిపడ్డాయి.
అగ్నిమాపక సి బ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టా రు. క్షతగాత్రులను హుటాహుటిన అనపర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కాగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నట్టు సమాచారం. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.