నీట్ 2024లో భారీ అవినీతి: బీఆర్ఎస్వీ
దేశంలో నీట్ 2024 పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్వీ ఓయూ నాయకుడు నాగేందర్ కోదాటి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం, ఎన్టీఏలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీ: దేశంలో నీట్ 2024 పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్వీ ఓయూ నాయకుడు నాగేందర్ కోదాటి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం, ఎన్టీఏలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో 720 మార్కులకు గాను 67 మందికి 720 మార్కులు వచ్చాయని గుర్తు చేశారు. ఇది సాధ్యంకానిదని మేధావులు, వైద్యులు ఘంటాపథంగా చెబుతున్నారన్నారు. ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురికి 720 మార్కులు రావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 180 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష నిర్వహించగా, 719, 718 మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విద్యార్థులు ఎంతో కష్టపడి పెద్ద పెద్ద నగరాల్లో లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్నప్పటికీ, ఎన్టీఏ అవినీతితో అదంతా వృథా అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవినీతి వెనుక పెద్దపెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్టీఏ డైరెక్టర్‌ను తక్షణమే అరెస్టు చేసి, సీబీఐకి కేసు అప్పగించాలని డిమాండ్ చేశారు. పరీక్షను తిరిగి నిర్వహించాలని, అప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

