హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) కోశాధికారిగా రాష్ర్టానికి చెందిన ఆస్కాని మారుతీసాగర్ ఎన్నికయ్యారు. ఐజేయూ వరింగ్ కమిటీ అధ్యక్షుడిగా గీతార్థ్ పాఠక్, ప్రధాన కార్యదర్శిగా వినోద్ కుమార్ కోహ్లీ ఎన్నికయ్యారు. సభ్యులుగా ఇంతియాజ్ అహ్మద్ బజాజ్(జమ్మూ కశ్మీర్), సుమన్ సుల్తానా అహ్మద్(అస్సాం), నిజామ్(ఛత్తీస్గఢ్), సంతోష్ గోపి(త్రిపుర), హేమంత్ ఎస్.సామంత్(మహారాష్ట్ర), జీతూ కళాతా(అస్సాం) ఎన్నికయ్యారు. మారుతీసాగర్ ఎన్నికపై తెలంగాణ జర్నలిస్టులు హర్షం వ్యక్తంచేశారు.