కొత్తగూడెం క్రైం/వాజేడు, జూన్ 6 : పోలీసు బలగాల నుంచి ఆత్మరక్షణ కోసం అమర్చిన బూబీట్రాప్స్ పేలి ఓ గ్రామస్థుడు చనిపోయిన ఘటనకు పో లీసులే పూర్తి బాధ్యతవహించాలని మా వోయిస్టు పార్టీ వాజేడు-వెంకటాపూరం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరు తో గురువారం లేఖ విడుదలైంది. ఈ నెల 3న వాజేడు మండలం కొంగాల అడవుల్లో కర్రెగుట్టపై వేట కోసం వెళ్లి బూబీట్రాప్స్పై కాలు వేయడంతో అది పేలి జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్లెందుల ఏసు మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మార్చి 6న వేటగాళ్ల రూపంలో అడవుల్లోకి వచ్చిన గ్రేహౌండ్స్ బలగాలు ఇన్ఫార్మర్ల ద్వారా సమాచారం తెలుసుకొని తమ దళంపై దాడి చేశాయని, దాడిలో తమ సహచరులు సంతోశ్ అలియాస్ సాగర్, మనీరామ్, లక్ష్మణ్ అమరులైనట్టు పేర్కొన్నారు. ఇలాంటి దాడుల నుంచి ఆత్మరక్షణ కోసం జన సంచారం లేని ప్రాంతాల్లో బూబీట్రాప్లను మావోయిస్టు పార్టీ అమర్చి.. ప్రజలను సైతం అటువైపు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నదని తెలిపారు. తాము అమర్చిన బూబీట్రాప్స్ పేలి అమాయకుడైన ఏసు బలయ్యాడని, దీనికి బాధ్యులు పోలీసులేనని ఆ లేఖలో పేర్కొన్నారు.