రామగిరి, జనవరి 16 : పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ ఎస్ఎస్ఆర్ కృష్ణకు అమెరికా నుంచి అరుదైన గౌరవం దక్కింది.
ఏటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే లేక్ వర్త్ బీచ్ స్టేట్ పెయింటింగ్ ఫెస్టివల్లో ఫీచర్డ్ ఆర్టిస్ట్‌గా పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. వచ్చే నెల 21, 22 తేదీల్లో ఫ్లోరిడా రాష్ట్రంలోని లేక్ వర్త్ బీచ్ నగరంలో ఈ వేడుక జరగనుండగా, ఈ అంతర్జాతీయ కళోత్సవానికి దేశం తరఫున ఒక్కరే ఎంపికయ్యారు.