హైదరాబాద్, అక్టోబరు 22 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ హైదరాబాద్లోని హుడాకాలనీకి చెందిన మంతెన శ్రీనివాసరాజు రాష్ట్రవ్యాప్తంగా బైక్యాత్ర చేస్తున్నారు. తన బైక్కు ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి ఓటు ప్రాధాన్యత తెలుపుతున్నారు.
ఓటర్లకు అభ్యర్థులపై వ్యతిరేకత, ఇష్టం లేకుంటే నోటాకు అయినా ఓటు వేయాలని, కానీ ఓటింగ్లో మాత్రం పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.