Yadagirigutta : యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మన్నె సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ అయిన సత్యనారాయణ రెడ్డికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలానే 10 మంది బోర్డు సభ్యులను, ఏడుగురు ఎక్స్ అఫీషియో సభ్యుల పేర్లను వెల్లడించారు.
యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదల సురేఖ, చిలప్పగారి విజయరాజం, విజయేందర్ తుల్ల, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంఠమని, ఎం. రాఘవేంద్ర రావు, డి. లక్మీనారాయణ నాయక్, ట్రస్టీ వ్యవస్థాపకులు నియమితులయ్యారు.
ప్రభుత్వ ప్రధాన, రెవెన్యూ, దేవాదాయ శాఖ కార్యదర్శి.. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి, స్థానాచార్యులు లేదా.. సీనియర్ ప్రధాన అర్చకులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు.