హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ ద్వారా రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే ఇప్పుడు రాష్ర్టాల్లో పోరాటాలు చేయాలని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. శనివారం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎమ్మార్పీఎస్ బృందం మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో భేటీ అయ్యింది.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో దీన్ని ఎలా అమలు చేయాలి.. ఎలా ముందుకు సాగాలన్న విషయాలపై ఆయన సలహాలను మందకృష్ణ కోరారు. ఇక ఇప్పుడు రాష్ర్టాల్లో పోరాటాలు చేయాలని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణకు మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సీజేఐగా ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ చేసిన మూడు దశాబ్దాల పోరాటాన్ని మాజీ సీజేఐ అభినందించారు.