హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): గురుకుల భవనాల నిర్వహణ, ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్, కార్పెంటరీ తదితర మరమ్మతుల బాధ్యత జోనల్ ఆఫీసర్లదేనని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) సెక్రటరీ అలుగు వర్షిణి వెల్లడించారు.
సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు. జోనల్ ఆఫీసర్లకే ప్లంబింగ్ కమ్ ఎలక్ట్రిషియన్లను(పీసీఈ) అటాచ్ చేశారు. ఒక్కో పీసీఈకి 2, 3 గురుకుల బాధ్యతలు అప్పగించారు. 268 గురుకులాలకు 93మంది పీసీఈలను కేటాయించారు. ప్రతి నెలా పీసీఈ రిపోర్టును అందించాలని ఆదేశించారు.