హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనా? లేక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట మా? అనేది యావత్ భారతావనిని ఉత్కంఠకు గురిచేస్తున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను ఎన్డీయే గెలుచుకున్నప్పటికీ, బీజేపీకి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సీట్లు రాకపోవడమే అందుకు కారణం. ఈ పరిణామాలే ఇండియా కూటమిలో ఆశలు రేపుతున్నాయి.
ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలు ఒకప్పుడు కాంగ్రెస్ కూటమిలోనివే కావడంతో వేగంగా పావులు కదుపుతున్నది. భాగస్వామ్య పక్షాలతో బుధవారం భేటీ కాను న్నట్టు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మీడియాకు తెలిపారు. చర్చల అనంతరం తమ కార్యాచరణపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ పరిణామాలను చూస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు కు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని అర్థమవుతున్నది.
ఇండియా కూటమి పావులు
‘మేం (ఇండియా కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న విశ్వాసంతో ఉన్నాం’ అని కాంగ్రెస్ కీలక నేత పవన్‌ఖేరా చేసిన వ్యా ఖ్యలు రాజకీయ వరాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎన్డీయేతో ఉన్న పక్షాలు మీతో టచ్‌లో ఉన్నా యా? అని ఢిల్లీలో పవన్ఖేరాను మీడి యా ప్రశ్నించగా, ‘తెరవెనుక జరుగుతున్న ప్రతీ విషయాన్ని బహిరంగపరచలేం’ అని వ్యాఖ్యానించి అనుమానాలను మరింత బలపరిచారు.
ఇండియా కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించిన జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆ తర్వాత ఎన్డీయేలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు ముందు రోజు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ చేసిన ప్రకటన ఎన్డీయేలో ప్రకంపనలు రేపుతున్నది ‘తన పార్టీని కాపాడుకునేందుకు నితీశ్‌కుమార్ ఏమైనా చేస్తారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చు’ అని చేసిన వ్యాఖ్యలు, నితీశ్‌కుమార్ ఇండియా కూటమిలోకి తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పకనే చెప్పాయి.
నితీశ్ వెళ్తే ఆయనతోపాటు ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ కూడా ఆ దిశగా ఆలోచించే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. బీహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వానికి గతంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. మరోవైపు, కేం ద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి. జేడీయూ, టీడీపీ రెండూ కాంగ్రెస్‌కు పాతమిత్రులే.
నితీశ్‌కుమార్‌కు ఉప ప్రధాని ఎర
బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌ను తిరిగి ఇండి యా కూటమిలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ కూటమి నేతలు పావులు కదుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నితీశ్‌కుమార్ ఇం డియా కూటమిలోకి వస్తే ఆయనకు ఉప ప్రధా ని పోస్టును ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. నితీశ్‌తో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. ఇం డియా కూటమిలో లేకపోయినా మమత తన మద్దతు ప్రకటించారు.
నితీశ్‌కుమార్‌తోపాటు, ఏపీలో 16 సీట్లు గెలిచిన టీడీపీ అధినేత చం ద్రబాబును ఇండియా కూటమిలోకి రప్పించడానికి మమత ప్రయత్నిస్తున్నట్టు సమాచా రం. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే రంగంలోకి దిగి చంద్రబాబుతో మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది. కర్జాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా చంద్రబాబుతో డీకే శివకుమార్ సంప్రదింపులు జరుపుతున్నారని కూడా చెప్తున్నారు.
బాబు చేజారకుండా బీజేపీ యత్నాలు
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో టీ డీపీ మద్దతు కీలకంగా మారడంతో బీజేపీ అప్రమత్తమైంది. చంద్రబాబు తమ కూటమిలోనే ఉన్నా ఆయన ‘చే’జారిపోకుండా ప్రధాని మోదీ, అమిత్‌షా స్వయంగా ఫో న్‌చేసి మాట్లాడినట్టు తెలిసింది. టీడీపీ విజయానికి శుభాకాంక్షలు తెలిపే సాకుతో పనిలోపనిగా చంద్రబాబుకు ఎన్డీయే కన్వీనర్ పోస్టు ఆఫర్ చేసినట్టు కూడా టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది.