హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మల్లేశ్‌గౌడ్ నియమితులయ్యారు. బీసీ డెవలప్మెంట్ ఫెడరేషన్(బీసీడీఎఫ్) జాతీయ అధ్యక్షుడు, గౌడ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్యగౌడ్ హైదరాబాద్‌లో మంగళవారం ఆయనకు నియామకపత్రం అందజేశారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు రామచంద్రయ్యగౌడ్కు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలకు మల్లేశ్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.